Friday, November 22, 2024

విషాదం… తల్లీకొడుకు ఆత్మహత్య

త‌ల్లీకొడుకు బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో చోటుచేసుకుంది. మంగలి శశికళ (30) పెబ్బేరు మండలం శాగాపూర్ గ్రామ వాసి చందుతో 17 ఏండ్ల కింద వివాహం జ‌రిగింది. త‌ర‌చూ భార్యభర్తల మ‌ధ్య తగాదాలు రావ‌డంతో గత పది సంవత్సరాల నుంచి గోవర్ధనగిరి గ్రామంలో ఉంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తుంది. రెండు వారాల కింద భ‌ర్త‌ గోవర్దనగిరి గ్రామానికి వ‌చ్చాడు. దీంతో శశికళ త‌న కుమారుడు అఖిల్‌(7)ను తీసుకొని గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

గ్రామ సమీపంలోని ఓ బావిలో దూకి త‌ల్లీకుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. బావిలో తేలియాడిన మృత‌దేహాల‌ను గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం వ‌న‌ప‌ర్తి ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement