Friday, November 1, 2024

TS: కృష్ణాన‌ది బ్రిడ్జిపై.. రేపటి నుండి తెలంగాణ-కర్నాటక మధ్య రాకపోకలు..

మక్తల్, మార్చి 1(ప్రభ న్యూస్) : కృష్ణ రోడ్డు బ్రిడ్జి రాకపోకలకు సిద్ధమైంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దున కృష్ణానదిపై ఉన్న ఈ రోడ్డు బ్రిడ్జి గుంతలమయం కావడంతో రాకపోకలను నిషేధించారు. 45 రోజులపాటు రాకపోకలు నిషేధించబడిన ఈ రోడ్డు బ్రిడ్జిపై రేపటి తెల్లవారుజామున 4 గంటల నుండి తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. 167వ జాతీయ రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. రోడ్డు బ్రిడ్జిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడం, పలుమార్లు గుంతల్లో వాహనాలు చిక్కుకొని ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది.

దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కృష్ణాన‌ది బ్రిడ్జి మ‌ర‌మ్మ‌త్తులు చేపట్టాలని నిర్ణయించారు. రోడ్డు బ్రిడ్జి మరమ్మతు కోసం జనవరి 17నుండి బ్రిడ్జి పై రాకపోకలు పూర్తిగా నిషేదించారు. బ్రిడ్జి మరమ్మ‌త్తులో భాగంగా పాత రోడ్డును పూర్తిగా తొలగించి సీసీ రోడ్డును నిర్మించారు. బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఈనెల 2న శ‌నివారం తెల్లవారుజామున 4 గంటల నుండి కృష్ణ బ్రిడ్జిపై రాకపోకలను కొనసాగించేందుకు అధికారులు అనుమతించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాకపోకలు నిషేధించిన స‌మ‌యంలో తెలంగాణ నుండి కర్ణాటక గోవా తదితర ప్రాంతాలకు వల్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయి రాకపోకలకు సిద్ధం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు
హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement