Tuesday, November 19, 2024

MBNR: మహిళా డాక్టర్ పై పైశాచిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 17 (ప్రభ న్యూస్) : మహిళా డాక్టర్ పై కోల్క‌తాలో పైశాచిక దాడి చేసిన మృగాలను ఎన్ కౌంటర్ చేయడం తప్పు కాదని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నుండి నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… వారం రోజులుగా ఈ ఘటనలో ప్రభుత్వం నిందితులను పట్టుకొని చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను ఫ‌ణంగా పెట్టి రోగులకు సేవ చేస్తూ రోగులకు ప్రాణాలు పొసే త‌మకు ఇలాంటి ఘటన భయాందోళనకు గురిచేస్తుందన్నారు. ఇలాంటి వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. తద్వారా మృగాలకు సరైన హెచ్చరిక జారీ చేసిన వారవుతారని సూచించారు. ఈ నిరసనకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు వైద్య సేవలు బంద్ చేసి వారికి మద్దతుగా నిలిచారు. ప్రైవేటు డాక్టర్లు కూడా వీరికి మద్దతుగా నిలిచి దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement