Friday, November 22, 2024

MBNR: ఏటీఎంలో దొంగల హల్చల్..

గండీడ్, ప్రభ న్యూస్ : మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగతనానికి తెగబడ్డారు. ఏటీఎంలో ఎటువంటి డబ్బులు దొరక్క‌పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంఘటన స్థలాన్ని మహబూబ్ న‌గర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీ నాయక్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ… నేరాలను అదుపు చేయాలంటే పోలీసులకు ప్రజల సహకారం అవసరమని ఆయన తెలిపారు.

ప్రజలందరూ ఏదైనా ప‌నిమీద‌ ఊర్లకు వెళ్లేట‌ప్పుడు తమ విలువైన వస్తువులను తమ దగ్గరలోనే ఉంచుకోవాలని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో కానీ, ఇతర ప్రధాన కార్యాలయంలో కానీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్సై కి సూచించారు. ఒక సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని అన్నారు.

అందుకే ప్రజలు, రైతులు తమ విలువైన వస్తువులకు సంబంధించిన వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని, జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడే దొంగతనానికి పాల్పడే వారిని  కట్టుదిట్టం చేయవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి, వారి సిబ్బంది, బ్యాంకు మేనేజర్ వారి సిబ్బంది, ప్రజలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement