Friday, November 22, 2024

MBNR: మహిళలకు ఇచ్చిన హామీలు రెండు నెలల్లో అమలు.. ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, జులై 1(ప్రభన్యూస్) : మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో అమలు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇచ్చిన మాట 100శాతం అమలు చేసి చూపిస్తామన్నారు. ఇవాళ మక్తల్ పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 69 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమతో సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

పేదింటి ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన నగదును ఆయా కుటుంబాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సువర్ణ రాజు, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, మాజీ జెడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, నాయకులు బోయ రవికుమార్, బి.గణేష్ కుమార్, పారేవుల విష్ణువర్ధన్ రెడ్డి, కావలి శ్రీహరి, కావలితాయప్ప, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement