మక్తల్, మార్చి23 (ప్రభ న్యూస్) : మక్తల్ పట్టణంలో వెలసిన జాంబవంత ప్రెస్టాపిత శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కోసం స్వామి అమ్మవార్ల ఆభరణాల కోసం మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ బాల్ చైర్ పావని మల్లికార్జున దంపతులు 10 గ్రాముల (తులం) బంగారం సమర్పించారు. శనివారం ఆలయం వద్ద స్వామివారికి మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ స్వామి వారి అమ్మవార్లకు అభరణముల తయారీ నిమిత్తం బాల్చేడ్ పావని మల్లికార్జున్ దంపతులు 10గ్రాముల బంగారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రాణేషాచారికి అందజేశారు.
ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం కోసం 10గ్రాముల బంగారం సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులను ప్రధాన అర్చకులు ప్రాణేషాచారి శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అవసరమైన ఆభరణాల కోసం వనాయకుంట గ్రామ మాజీ సర్పంచ్ రాధనరసింహా యాదవ్ 1 గ్రాము బంగారం, బిలకంటి జ్యోతి రఘునాథ్ గుప్తా దంపతులు(గంజ్) 2 గ్రాముల బంగారం, మరాఠీ కృష్ణారెడ్డి రాధ దంపతులు(గంజ్) 5 గ్రాముల బంగారం, పంచదేవ్ పహాడ్ మాజీ సర్పంచ్ కల్పనా కృష్ణయ్య చారి 2 గ్రాముల బంగారం ఆభరణముల తయారీ నిమిత్తం ఆలయ ప్రధాన అర్చకులు ప్రాణేశాచారి, అర్చకులు అరవింద్ చారి లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కుమ్మరి శ్రీనివాస్, బిజెవైఎం నాయకులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు ఎవరైనా సీతారాముల కళ్యాణం కోసం అవసరమైన ఆబాందరునాల ఆభరణాల తయారీ కోసం బంగారం సమర్పించాలనుకునే వారు తమను సంప్రదించి అందజేయవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు ప్రాణేశాచారి తెలిపారు.