Friday, November 22, 2024

TS: కమిషనర్‌ తీరుపై నిరసన వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు

మున్సిఫల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కవరేజిని బహిష్కరించిన మీడియా
అచ్చంపేట, జులై 6, ప్రభ న్యూస్‌ : మున్సిపల్‌ కమిషనర్‌ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను బహిష్కరించిన సంఘటన అచ్చంపేట పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. అచ్చంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మాణాన్ని పురస్కరించుకొని అచ్చంపేట ఆర్డీఓ కే.మాధవి సమక్షంలో శనివారం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు అధికారిక కార్యక్రమాన్ని చేపట్టుతున్నట్లు మున్సిపల్‌ ఛైర్మన్‌ శుక్రవారం మీడియా ప్రతినిధులకు ఆహ్వానం ఇచ్చారు.

మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌ ఆహ్వానం మేరకు కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించడం అటుంచి కనీసం మందలించకుండా దాదాపు 2 గంటల పాటు చెట్ల క్రింది నిల్చోబెట్టడంతో కమిషనర్‌ తీరును నిరసిస్తూ మీడియా ప్రతినిధులందరూ ఛైర్మన్‌ ఎన్నికను బహిష్కరించి అక్కడి నుండి వెళ్లిపోయారు.

మంత్రుల సాక్షిగానూ మీడియా ప్రతినిధులకు అవమానం…
కాగా శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంత అభివృద్ది అధ్యయన కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనరసింహ్మతో పాటు పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే సాక్షిగా ఫారెస్టు అధికారులు మీడియాకు అనుమతి ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలకు అనుమతి ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విధితమే. అటవీ జంతువుల సంతానోత్పత్తి కారణంగా మీడియాకు ప్రవేశం లేదు, కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలకే ప్రవేశం అన్న ఫారెస్టు అధికారులు స్థానిక, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనుమతించడం, ఒకానొక దశలో సపారీ వాహనంలో కార్యకర్తల హడావుడితో మంత్రికే చోటు లేకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేసిన ఘటన చోటు చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -

వరుసగా మీడియాకు అవమానం జరుగుతుండడం పట్ల మీడియా ప్రతినిధులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ తీరు మార్చుకొని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియా ప్రతినిధులపై మరోసారి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధులకు సముచిత గౌరవాన్ని ఇవ్వాలని మీడియా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement