Tuesday, November 26, 2024

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద

రాష్ట్రంలోని కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకి భారీగా వ‌ర‌ద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఇక్కడ 41 గేట్లు ఎత్తేసిన 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇన్‌ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.61 మీటర్లకు నీటిమట్టం చేరింది. ఇక్కడి పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.85 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement