Saturday, November 23, 2024

TS : ప్రారంభమైన పది పరీక్షలు

మక్తల్, మార్చి18(ప్రభన్యూస్) : పదవ తరగతి వార్షిక పరీక్షలు ఇవాళ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 1281 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు కొనసాగనుండగా గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

- Advertisement -

ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. మొదటిసారి బోర్డు పరీక్షలు రాయనుండడంతో విద్యార్థుల్లో కొంత ఆందోళన కూడా కనిపించింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మిత్రులు పరీక్షా కేంద్రాల వద్దకు తరలివచ్చి విద్యార్థులకు మనోదైర్యాన్ని కల్పించి పరీక్ష కేంద్రాలకు పంపించారు. మక్తల్ లో పదవ తరగతి పరీక్షలకు గాను కేరళ హైస్కూలు సెంటర్ లో 219 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది,జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 240 మంది, బ్రిలియంట్ గ్రామర్ హైస్కూలు లో 189 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200 మంది,అక్షర హైస్కూల్ సెంటర్ లో 193 మంది విద్యార్థులు మొత్తం 1281మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంఈఓ వెంకటయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉందని ఆయా కేంద్రాలకు సమీపంలో ఎవరూ రాకుండా ఉండాలని పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై వై. భాగ్యలక్ష్మి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement