Friday, November 22, 2024

ప్ర‌శాంతంగా ప్రారంభ‌మైన‌ టెన్త్ పరీక్షలు…

మహబూబ్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా పది పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమ‌య్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లావ్యాప్తంగా 59 రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు, ఒక ప్రైవేట్ కేంద్రం మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 12,829 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందులో 12,561 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 268 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు.

ఈ విడత పదవ తరగతి పరీక్షలు 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే ఉంటాయని, రెండు పేపర్లు తప్ప తక్కిన అన్ని పేపర్లు ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా పరీక్షా సమయానికంటే ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. వారికి కేటాయించిన గదులను హాల్ టికెట్ల వారీగా నోటీస్ బోర్డులపై అంటించగా.. విద్యార్ధులు గుమికూడి వెతుకులాడుకున్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది పరీక్షా కేంద్రాల ద్వారాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. విద్యార్థులు, వారు తల్లిదండ్రుల్లో పరీక్షా కేంద్రాల వద్ద సందడి కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement