Tuesday, November 26, 2024

జోగుళాంబ జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య..

మానవపాడు, మార్చి 1 (ప్రభ న్యూస్) : ఓ రైతు భూమిని న‌మ్ముకుని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో సాగు కోసం అప్పు చేసి ఉన్న ఎకరానికి తోడుగా పదహారు ఎకరాలు కౌలుకు తీసుకుని అందులో పత్తి వేశాడు. ఆ పంట‌ పైనే అప్పులు తీర్చాల‌నుకున్నాడు. అయితే తనొకటి త‌లిస్తే దైవం మరొకటి త‌లిసింది అన్న‌ట్టుగా ఆ పంట రాలేదు. పైగా బోలెడు పెట్టుబడులున్న అప్పులే కాకుండా కొత్తగా అప్పులు చెయాల్సిన పరిస్థితి. అంత పెట్టినా కనీసం పంటలో పెట్టుబడి కూడా రాలేదు. దీంతో చేసిన అప్పులు వ‌డ్డితో క‌లిసి పెరిగిపోయాయి. ఆ అప్పుల బాధ‌లు భ‌రించ‌లేక త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం వ‌ద్ద పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన కురువ నరసింహులు (42) అనే రైతుకు భార్య జయమ్మ, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కురువ నరసింహులుకు బొంకూరు గ్రామ శివారులో ఎకరం వ్య‌వ‌సాయ‌ భూమి ఉంది. అతనికి వ్యవసాయంపై మక్కువ ఉండడంతో ఎకరం పొలానికి అదనంగా మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశాడు. గతేడాది సాగునీరు లేకపోవడంతో గతేడాది అప్పుచేసి వేసిన పంటలు చేతికి రాలేదు. దీంతో అప్పులు తీర్చేందుకు ఉన్న ఒక్క దారి గత ఏడాది ముసుకుపోయింది.ఈసంవత్సరం పంటకు చేసిన అప్పులు సుమారు రూ.10లక్షల వరకు పెరిగిపోయాయి. అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని అడుగుతార‌ని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి పంట చేనుకు వెళ్లాడు. పంట చేను సమీపంలోని క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పొలాలకు వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ హస్పిటల్ కు తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై బాలరాజు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


రక్షణ లేని కౌలు రైతాంగం :
భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన
ఏ మేలు అందుకోలేకపోతున్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడంలేదు. కౌలు కాగితమో, రికార్డులలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది.

- Advertisement -


ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి : బొంకూరు గ్రామం చిన్న రాముడు
కురువ నరసింహులు నాకు తమ్ముడు అవుతాడు. తమ్ముడికి వ్యవసాయం అంటే ఎంతో మ‌క్కువ ఉండ‌డంతో ఉన్న ఎకరం కంటే ప్రతి సంవత్సరం ఎక్కువ పొలం కౌలుకు వెసుకునేవాడు. నష్టం వ‌చ్చినా వదిలేవాడు కాదు. అలా నష్టాలతోనే దాదాపుగా రూ.15లక్షల అప్పు అయిందని చెబుతుండేవాడు. ప్రభుత్వం స్పందించి ఆకుటుంబాన్ని ఆదుకోవాలి.
నలుగురు ఆడపిల్లలకు అక్కలా అండగా ఉంటా : బొంకూరు సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి
మా గ్రామానికి చెందిన కురువ నరసింహులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. నరసింహులుకు నలుగురు ఆడపిల్లలు. వారికి ఏకష్టం వచ్చినా ఒక అక్కలా ఆదుకుంటాను. నరసింహులు గతంలో ఇసుక ఎద్దుల బండితో కుటుంబాన్ని పోషించేవాడు. మొదటి నుండి అతనికి వ్యవసాయం మక్కువ ఉండేది. తనకు ఉన్న ఎక్కరం పొలానికి తోడుగా పదహారు ఎకరాలు కౌలుకు వేసుకున్నాడు. ఈసంవత్సరం తెగుళ్లు, వర్షాభావంతో ఊర్లో చాలా మందికి పత్తిపంట అనుకున్నంత రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement