మక్తల్ : అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని ప్రజా భవన్ లో వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరుల ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో 1200 మంది విద్యార్థి యువకులు బలిదానం చేయడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement