Tuesday, November 26, 2024

MBNR: రైతన్న సంక్షేమంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ … ఎమ్మెల్యే వంశీకృష్ణ‌

అచ్చంపేట, జులై 19, ప్రభ న్యూస్ : రైతు సంక్షేమంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచి, దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ నిలిచిందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు రుణమాఫీ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుండి బస్టాండ్‌ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి ఎద్దుల బండ్లలో వచ్చిన రైతులతో కలిసి రైతు కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సోనియా, రాహుల్‌ గాంధీలు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు రుణ మాఫీ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని చరిత్ర తిరగ రాశారన్నారు.

రైతు రుణ మాఫీ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవతరించిన నాటి నుంటి నేటి వరకు గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని బూటకపు, కల్లిబొల్గి మాటలతో రైతాంగాన్ని మోసగించాయన్నారు. త్వరలోనే రైతులకు హెల్త్‌ కార్డులు కూడా ముఖ్యమంత్రి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ గార్లపాటి శ్రీనివాసులు, ఉమామహేశ్వర ఆలయ ఛైర్మన్‌ మాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేటు జి.రాజేందర్‌, బిక్కుమాండ్ల రాజేష్‌, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement