Tuesday, November 26, 2024

స్వాతంత్ర్యం అంటే ఉద్యోగ, ఉపాధి అని నిరూపించిన తెలంగాణ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్వాతంత్ర్యం అంటే ఉద్యోగ, ఉపాధి అని తెలంగాణ నిరూపించిందని రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ AVD సినిమా థియేటర్ లో విద్యార్ధుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ సినిమా ప్రదర్శనను ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సినిమా తిలకించారు. అనంతరం మోనప్పగుట్టలో ఉన్న జ్ఞాన భారతి ఉన్నత పాఠశాల వద్ద ఇంటింటికీ జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి జెండాలు అందించారు. దారికి ఇరువైపులా ఉన్న విద్యార్థులకు జెండాలను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ….
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. స్వాతంత్ర్య పోరాటం మనం చూడలేదని.. కానీ అదే స్పూర్తితో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం చూశామని తెలిపారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద జనాభా ఉన్న మన దేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అహింసాయుత పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధించిన మహాత్ముడిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్, డిఎస్పీ మహేష్, స్థానిక కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్, పీఆర్టీయు నాయకుడు నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement