గద్వాల (ప్రతినిధి) జూన్ 3 (ప్రభ న్యూస్) : గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం దశాబ్ది ఉత్సవాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగరవేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ… 60ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, 14ఏళ్లు కోట్లాడి తొలి మలిదశ ఉద్యమంతో నిజం చేసి కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించినందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులను సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దంపతులు
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎమ్మెల్సీ దంపతులు స్వాతి నవీన్ కుమార్ రెడ్డి దంపతులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫాం ఇచ్చిన రోజు నుండి పోలింగ్ రోజు ఫలితాలు వెలువడే దాకా వెన్నంటి ఉండి తన విజయానికి పూర్తి బాధ్యత స్వీకరించిన గెలుపు కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యేకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.