Thursday, November 21, 2024

ట్యాంక్ బండ్, శిల్పారామం పనులు వేగవంతం చేయాలి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ పట్టణంలోని ట్యాంక్ బండ్, శిల్పారామం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈరోజు ఉదయం ఆయన ట్యాంక్ బండ్ లో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి, నక్లెస్ రోడ్డు, తదితర పనులను తనిఖీ చేశారు. వర్షం కారణంగా సస్పెన్షన్ బ్రిడ్జి, రోడ్డు తదితర పనులు ఆగిపోయాయని డీఈ మనోహర్ మంత్రి దృష్టికి తీసుకు రాగా.. బ్రిడ్జిలకు అవసరమైన స్లాబులను పూర్తి చేయాలని, అదేవిధంగా నక్లెస్ రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో తక్షణమే మట్టిని నింపే ఏర్పాటు చేస్తే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవకాశముంటుందని, అదేవిధంగా పనులు ఆగిపోకుండా నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.

శిల్పారామం పనులను తనిఖీ చేస్తూ ఈ పనులు కూడా వేగవంతం చేయాలని, శిల్పారామం చుట్టూ కాంపౌండ్ నిర్మించి గేటు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అంతకు ముందు మంత్రి రామయ్యబౌలిలో నాళాలను పరిశీలించారు. ముఖ్యంగా పెద్ద చెరువు తూము నుండి వచ్చే ఆలుగును పరిశీలించి మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింలు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement