అచ్చంపేట, జులై 15, ప్రభ న్యూస్ : జులై 20 శనివారం అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నిర్వహించబోయే ఉచిత మెగా కార్డియాక్, న్యూరో, ఆర్థోపెడిక్ క్యాంపులను అచ్చంపేట నియోజకవర్గ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
సీబీఎం ట్రస్ట్ ఛైర్‌పర్సన్ చిక్కుడు అనురాధ సారథ్యంలో, ప్రముఖ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జులై 20న అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గుండె, నరాలు, ఎముకలకు సంబంధించిన టెస్ట్‌లను అధునాతన పరికరాలతో పరీక్షించి చికిత్స అందించబడునని, గుండె, ఛాతీలో నొప్పి వున్న వారికి ఈసీజీ, 2డి ఈకో పరీక్షలు నిర్వహించి సమస్యలున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా కేర్ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగ పరచుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరారు.