Thursday, November 21, 2024

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే..

మక్తల్ : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులకు అనుమతి లేకుండా ఆలయ తలుపులు మూసి ఉంచి పరిమిత సంఖ్యలో అర్చకులు, వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య నిరాడంబరంగా కళ్యాణ వేడుకలు నిర్వహించారు. శ్రీరామనవమి సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు ..ముత్యాల తలంబ్రాలను సమర్పించంతో పాటు కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ ,తెరాస సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, నాయకులు రాజ మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ గాయత్రి, కావలి తాయప్ప ,కొత్త కాపు గోవర్ధన్ రెడ్డి ,చెన్నయ్య గౌడ్ ,ఎల్లారెడ్డి , ఆలయ ధర్మకర్త పి.భీమాచార్య ,ఆలయ మేనేజర్ సత్యనారాయణ, అర్చకులు పి. ప్రాణేషా చారి, రాఘవేంద్ర ఆచార్య,అరవింద చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement