Friday, November 22, 2024

MBNR: విజయవంతంగా మెగా సర్జికల్ క్యాంపు.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, జులై 13, ప్రభ న్యూస్ : శనివారంతో మెగా సర్జికల్ మొదటి దశ క్యాంపు పూర్తిగా విజయవంతమైందని, అందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావులకు, క్యాంపులో సహకరించిన డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ లాల్, డిస్టిక్ కోఆర్డినేటర్ రమేష్ చంద్ర, వనపర్తి డీఎం అండ్ హెచ్ ఓ ఆలె శ్రీనివాసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తార సింగ్, డాక్టర్లు మహేష్, బంధం శ్రీనివాసులు, బాల్ సింగ్, పవన్, ఉదయ్, హరిత, డ్యూటీ డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, నర్సులు, వార్డ్ బాయ్స్, ఆయాలు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

శనివారం మెగా సర్జికల్ క్యాంపు ముగింపు దశలో చేసిన ఆపరేషన్ల అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి దశ సర్జికల్ క్యాంపులు నమోదు చేసుకున్న 1,236 మందికి పూర్తిస్థాయిలో ఉచితంగా ఆపరేషన్లు చేసి విజయవంతంగా క్యాంపును నేటితో బోధించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈనెల 20న మెగా కార్డియాక్ క్యాంప్ తో సహా న్యూరో అండ్ ఆర్థోపెడిక్ క్యాంపు….
సీబీఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ సహకారంతో అండ్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈనెల జులై 20న అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెగా కార్డియాక్ (హృద్రోగ గుండె సంబంధిత) క్యాంపుతో పాటు న్యూరో అండ్ ఆర్థోపెడిక్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, ఈ మెగా క్యాంపులను అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ప్రభు, డాక్టర్లు మహేష్, బాల్ సింగ్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement