Saturday, November 16, 2024

TS: వైభవంగా శ్రీ శివ మహా పూజలు

మక్తల్, ఫిబ్రవరి 27 (ప్రభ న్యూస్) : మక్తల్ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద శివమాల దీక్షపరుల 24వ శ్రీ శివ మహాపూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇవాళ అర్చకులు శివ ఆధ్వర్యంలో శివమలదారుల గురుస్వామి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 24వ శ్రీ శివ మహాపూజ సందర్భంగా పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పట్టణ పురవీధుల గుండా శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం వరకు కలశ ఊరేగింపు నిర్వహించారు. దారిపొడవునా భక్తులు కలస ఊరేగింపు స్వాములకు నిండు నీటి బిందెలతో నీళ్లు పారబోసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద జరిగిన మహా పూజ వేడుకల్లో శివుడికి అభిషేకం, బిల్వార్చన, విశేష పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉడిపి పెజవర మఠం తెలంగాణ ఆంధ్ర ధర్మ ప్రచారక్ విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య పాల్గొని పరమశివుడి గొప్పదనాన్ని మనిషిలోని దుర్గుణాలు, సద్గుణాలను వివరించారు. భగవంతుడి నామస్మరణ ప్రతిరోజూ చేయాలని సూచించారు. శివ నామస్మరణ ప్రతినిత్యం చేయాలన్నారు. గోమాతను పూజించాలని హిందువుల చిరకాల వాంఛ అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు. శివదీక్షాపరుల సంకల్పంతో త్వరలో కాశీ విశ్వనాథుడి ఆలయ పునర్నిర్మాణం కూడా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో మక్తల్ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శివ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement