Tuesday, November 19, 2024

శ్రీరామనవమి వేడుక పై మీటింగ్..

పెద్దకొత్తపల్లి : శ్రీరామనవమి వేడుకలను ఎవరి ఇంటివద్ద వారే భక్తితో జరుపుకోవాలని కొల్లాపూర్ సిఐ వెంకటరెడ్డి ప్రజలను కోరారు.. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు రామాలయం హనుమాన్ మందిరాల కమిటి సభ్యులకు సిఐ ఆఫీసుకు ఆహ్వానించి జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సి ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్నందున ప్రజలను ఎవరిని కూడా మందిరాలకు అనుమతించరాదని, కొంత మంది కమిటీ సభ్యులు స్వామి వారి పూజలను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆలయంలో జరపాలని కోరారు. భక్తులు.. ఎవరి ఇంటివద్ద వారే భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఊరేగింపులు చేయరాదని పోలీస్ వారు విజ్ఞప్తి చేయగా అందుకు పూజారులు.. ఆలయ కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు.. మా పోలీస్ వారి తరుపున కృతజ్ఞతలు.. ప్రజలందరు సహకరించి జరగబోయే శ్రీరామ నవమిని ఎవరి ఇండ్లవద్ద వారు జరుపుకొని పోలీస్ వారికి సహకరించి కరోనాని అరికడుదాం అని సిఐ వెంకట్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement