మక్తల్, ఫిబ్రవరి02(ప్రభన్యూస్): మక్తల్ పట్టణంలో ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఇవాళ అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ మనసాని వెంకటేష్ గుప్తా సరళాదేవి, కిరణ్ ప్రత్యూష దంపతులు తమ తల్లి తండ్రి మనసాని నరసింహయ్యగుప్త రత్నమ్మ జ్ఞాపకార్థం ఆలయ పునర్నిర్మాణం అమ్మారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను నిర్వహించారు.
వేద పండితులు రాఘవేంద్ర ఆచార్య ,శ్యామ్ సుందర్ జోషి, శేషగిరి ,విజయేంద్ర చారి, వంశీకృష్ణ జోషి బృందం వేదమంత్రోశ్చరణల మధ్య అమ్మవారి ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి విగ్రహంతో పాటు అమ్మవారి పాదుకలు ,బలిపీఠం ప్రతిష్టించారు. వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ,సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ ,శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ప్రతిష్టాపన వేడుకల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.