Saturday, November 2, 2024

MBNR | యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి ప్రతినిధి, నవంబర్ 2(ఆంధ్ర ప్రభ): తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, ఈ క్రమంలోనే చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు, ప్రైవేటు పరిశ్రమ‌ల్లో ఉపాధి కల్పన కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

శనివారం వనపర్తి పట్టణంలోని ఆర్ జీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల ఏర్పాటు అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్యల్లో ఎంతో ప్రావీణ్యం ఉండి, సరైన ప్రోత్సాహం లేక వెనకబడి పోయే నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి, చిన్న మధ్యతరః పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, సంబంధిత బ్యాంకర్లు సానుకూలంగా ఉన్నారని, వారు కల్పించే ఈ అవకాశాన్ని యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన యువతీ యువకులు గ్రామాల్లోని అందరికీ అవగాహన కల్పించాలని, అవసరమైతే మరో వారం రోజుల్లో మరో కార్యక్రమం నిర్వహించుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెలంగాణ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో వనపర్తి నియోజకవర్గం ముందుండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు, అవార్డు ఏజెన్సీ సభ్యులు, పారిశ్రామిక వేత్తలు, పలు బ్యాంకుల మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, అధికారులు వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement