Friday, November 22, 2024

MBNR: శెభాష్‌ పోలీస్‌… రాందాస్‌… పర్యావరణ ప్రేమికుడు

స్వచ్ఛందంగా 200 మొక్కల దత్తత
సమాజహితమే తన హితము
భావితరాల భవిష్యత్తుకు నేడే మొక్కలు నాటాండి..
సంరక్షించండని నినదిస్తున్న కానిస్టేబుల్‌ రాందాస్‌
అచ్చంపేట, జులై 30, ప్రభ న్యూస్ : భావితరాల భవిష్యత్తుకు నేడే మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అంటూ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాందాస్‌ స్వచ్ఛందంగా 200మొక్కలను దత్తత తీసుకొని వాటిని స్వయంగా నాటి వాటి సంరక్షణ చేపట్ట నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ పోలీస్‌ కానిస్టేబుల్‌. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని జూలై 31వ తేదీ నాటికి అధిక సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఇచ్చిన పిలుపున‌కు స్పందించి సమాజ సేవలో తన వంతు పాత్రని పోషించాలని సంకల్పించిన రాందాస్‌ స్వఛ్చందంగా ముందుకు వచ్చి 200 మొక్కలను దత్తత తీసుకున్నాడు.

ఆ మొక్కలను అచ్చంపేట మండల పరిధిలోని గుంపన్‌పల్లి గ్రామ పరిధిలో తానే స్వయంగా నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నాడు. గురువారం తనను కలిసిన ఆంధ్రప్రభ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ… నేను ప్రేమించే నా ప్రకృతి కోసం, నాకు ఉపిరిపోస్తున్న నా ప్రకృతి కోసం నా వంతు కృసి చేయాలనే సంకల్పంతో నా విధి నిర్వహణకు సెలవు పెట్టి మొక్కల నాటే బాధ్యతను తీసుకున్నాని అన్నారు. ప్రతి మొక్క ఒక కొత్త జీవితానికి ప్రతీక అని, మన పిల్లలకు పచ్చని భూమిని అందించేందుకు ముందడుగు వేయాలని, ప్రకృతిని ప్రేమించడం అంటే మన ఆత్మను ప్రేమించడం వంటిదన్నారు. ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు తరాల వారి క్షేమంకోసం జీవనాధారమైన మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని కోరారు.

సిసలైన ప్రెండ్లీ పోలీస్‌…
అచ్చంపేట పోలీసు శాఖ పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామావత్‌ రాందాస్‌ మొదటి నుంచి సేవా భావం, సమాజ హితం కోసం పరితపించే మంచి మనస్సున్న వ్యక్తిగా, నేర పరిశోధనలో సత్వరమే పరిష్కరించే వ్యక్తిగా అటు డిపార్ట్‌మెంట్‌లోనూ, ఇటు ప్రజలలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో క్లిష్టమైన కేసులను వెంటనే ఛేదించి ఔరా అనిపించుకుంటుంటాడు. పోలీస్‌ శాఖ తరపున పాల్గొన్న ప్రతి ఈవెంట్లలో పథకాన్ని సాధించడం ఒక ఎత్తు కాగా మానవత్వంలోనూ ముందుంటాడు. గత కొన్ని రోజుల క్రితం సలేశ్వరం జాతరలో ఒక వృద్దురాలిని తన భుజాలపై లోయ క్రింది నుండి పైకి మోసుకొచ్చి మానవత్వాన్ని చాటుకొని అందరి ప్రశంసలను పొందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement