అడ్డాకుల : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ నూతన మండల కమిటీ అధ్యక్షులుగా మండల కేంద్రంలో జీవరత్నం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ , ఉపాధ్యక్షుడు భరత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎస్‌ఎఫ్‌ఐ అడ్డాకుల మండల అధ్యక్షుడు జీవరత్నం.. కార్యదర్శి నవీన్‌ను ఎన్నుకున్నామన్నారు. వారితో పాటు 11 మంది మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న విద్య కాషాయీకరణ నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకించేందుకు సమరశీల పోరాటాలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ ముందుండి పోరాడాలని వారు తెలిపారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ , అనేక యూనివర్సిటీలలో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తూ అన్ని దేశాల్లో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఎస్‌ఎఫ్‌ఐ గెలుపొందిన వారు సూచించారు. మండల కేంద్రానికి ప్రభుత్వ హాస్టల్ , ఐటిఐ కళాశాల , డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయుట కోసం భవిష్యత్తులో పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement