ఊట్కూరు… ఊట్కూరు మండలం ఎడవెల్లి గ్రామం లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ గాండ్ల శిరీష గ్రామంలో శనివారం నుండి స్వచ్ఛంద లాక్ డౌన్ కు నిర్ణయం తీసుకోవడంతో గ్రామస్తులు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపి కరోనా కట్టడికి నడుంబిగించారు. ఉపాధి హామీ పనులు సైతం నిలిపివేశారు. ఎడవెల్లి గ్రామం లో గత రెండు రోజుల నుండి 20 కరోనా వైరస్ కేసులు నమోదు అయిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఉద్ధృతి అరికట్టేందుకు గ్రామంలో వివిధ హోటల్లు మూసివేయించారు. ఉదయం సాయంత్రం వేళ ఒక గంట మాత్రం కిరాణా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వగా కో వీడు నిబంధనలను పాటించి మాస్కులు ఉన్నవారికే సరుకులు ఇవ్వాలని దుకాణాల యజమానులకు సూచించారు. దీంతో గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపడుతున్నామని సర్పంచ్ శిరీష వెల్లడించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement