శ్రీరంగాపురం : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలు గత సంవత్సరం నుండి ఏ హడావుడి లేకుండా వేదపండితుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతోంది.ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు చెప్పిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సామాజిక దూరంతో పాటు శానిటైజర్ తో, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలి అని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంక్షలు విధించడంతో భక్తులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా తమ ఇళ్లలోనే శ్రీ సీతారాములను మనసులోనే స్మరించుకున్నారు. ఏది ఏమైనా శ్రీ రామమూర్తికి కూడా కరోనా ఎఫెక్ట్ తప్పలేదని భక్తులు వాపోతున్నారు. గ్రామాలలో అన్ని దేవాలయాల్లో అన్ని లాంచనాలతో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగాయి .
Advertisement
తాజా వార్తలు
Advertisement