నాగర్ కర్నూలు : జిల్లా కేంద్రంలోని రాంనగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా. శాస్త్రోక్తంగా వేద పండితులచే నిర్వహించినట్లు ఆలయ ప్రధాన పూజారి కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఆలయంలో ఉదయం నుండే వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేద బ్రాహ్మణులచే యజ్ఞోపవీతం, సీతమ్మ రామచంద్ర స్వామి వార్లకు కంకణధారణ, పూలమాల ఉత్సవం, పుష్పమాల , పుష్పొత్సవం,వేద బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆధ్యాత్మిక కల్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పంపిన పట్టు వస్త్రాలను సీతా రామచంద్ర స్వామి వారికి కౌన్సిలర్లు బాదం సునీత, కొండూరు లలిత దంపతులచే సమర్పణ చేశారు.
మంగళ వాయిద్యాల నడుమ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని వివరిస్తూ పూజ నిర్వహించారు. అనంతరం స్వామి వార్ల కల్యాణోత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది. సీతారామచంద్ర స్వామి వార్లకు తలంబ్రాలు, సమర్పణ అనంతరం భక్తులకు తలంబ్రాల పంపిణీ నిర్వహించారు.స్వామివారికి నివేదించిన ప్రత్యేక తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు కందాడై శ్రీనివాసాచార్యులు ,అజయ్ కుమార్ , శ్రీనివాసులు నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ సభ్యులు రవీందర్, కౌన్సిలర్ లో బాదం సునీత నరేందర్, కొండూరు లలితా భాస్కర్, కాలనీవాసులు భక్తులు మహిళలు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం….
Advertisement
తాజా వార్తలు
Advertisement