గద్వాల ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రభ న్యూస్): దేశంలో అన్ని వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమాన్యాయం కోసం అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులు, రాజకీయ నేతలు, వివిధ సంఘాలు నివాళ్లర్పించాయి. అంటరాని వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడి విగ్రహాలు ఊరు వాడలో ఊరి చివర్లో ఉంటాయి, కానీ పట్టణ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహాన్నికి కాంస్యం విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని గత నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఇప్పటికి నిలబెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నానని సరిత తిరుపతయ్య అంబేద్కర్ జయంతి సందర్భంగా హామీ ఇచ్చారు.
గతంలో పాలించిన రాజకీయ స్వార్థపరుల కుట్రలతోనే కాంస్య విగ్రహం ఏర్పాటు పూర్తి కాలేదు.. ఇప్పటికైన వారు తప్పుకుంటే వచ్చే జయంతి వేడుకల నాటికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి చేయడానికి సిద్దంగా ఉన్నామని జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య వెలడించారు.
గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి , పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నందు మహనీయుడి విగ్రహాన్నికి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్టీసీ కార్మికులు డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలో జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య, పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.