Saturday, November 23, 2024

సఫాయి కార్మికుల సమస్యలు…

కొత్తకోట : వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో 255 గ్రామపంచాయతీలో పని చేస్తున్న సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మిషేక్ చర్మకార జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 16 పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 19 వేల నుండి క్యాటగిరి ప్రకారం 30 వేలు ఇవ్వాలని, 30 ఏళ్ళ నుండి పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. అలాగే ప్రతి కార్మికునికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని వారికి ఈఎస్ఇ. పీఎఫ్ వర్తింపజేయాలని కోరారు. సఫాయి కార్మికుడు పని చేస్తూ చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని..ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా లేదా ఎస్సి కార్పొరేషన్ ద్వారా కార్మికుల కుటుంబాలకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. పని చేస్తూ చనిపోయిన కార్మికునికి తక్షణ సాయం అందించాలని వినతి ద్వారా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement