Tuesday, November 26, 2024

వర్షాలకు కుళ్లిన ఉల్లి ..పంటను దున్నిన రైతు

మానవపాడు, (ప్రభ న్యూస్) : జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడటంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉల్లి పంటలు కుళ్లిపోతున్నాయి. కొందరు రైతులు పంటను తీయగా.. అంతలోనే వర్షాలు రావడంతో గడ్డలు మొలకెత్తుతున్నాయి. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు.
ఒకవైపు దేశవ్యాప్తంగా, అటువర్షాలు, ఇటు ఉల్లి ధరలు ఎక్కుతగ్గుదలతో రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది.

మరోవైపు జోగుళాంబ జిల్లాలో ఉల్లి రైతులు పండించిన పంటకు కనీస విలువ లభించక లబోదిబో మంటున్నారు. కల్లుగొట్ల గ్రామంలో మాధన్న కౌలు రైతు పదిఎకరాలు ఉల్లి వేశాడు. వరుసగా కురిసిన వర్షాలకు పంటచేనులోనే కుళ్లిపోయింది. దీంతో చేసేదేమీ లేక పంటపైనే ట్రాక్టర్ తో దున్నించాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షాలకు కుళ్లిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement