దేవరకద్ర :నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలంలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవస్థానంలో నూతన చైర్మన్ ప్రతాప్ రెడ్డి , పాలకమండలి సభ్యులు , స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకమండలిగా ఎన్నికైనా చైర్మన్ , సభ్యులు దేవాలయ అభివృద్ది కోసం అన్ని విధాలా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నూతన పాలకమండలి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తదుపరి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూజలు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ , పాలక మండలి సభ్యులకు శాలువాలతో సన్మానించారు. కురుమూర్తి దేవస్థానం వద్ద జరుగుతున్న రాజ గోపురం నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేసేందుకు అధికారులు నూతన పాలకమండలి సభ్యులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పనుల విషయంలో నాణ్యత లోపిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రాజగోపురం పనులు మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. గుట్టపైకి రోడ్డు వేసిన దాతలను సన్మానం చేసిన ఎమ్మెల్యే
కురుమూర్తి దేవస్థానం వద్ద గుట్టపైకి మట్టి రోడ్డు వేసిన దాతలను గురువారం ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , ఎంపిపి హర్షవర్దన్ రెడ్డి, జడ్పిటిసి రాజేశ్వరి రాము , ఎండోమెంట్ అధికారులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షుడు జడ్పిటిసిలు , ఎంపిటిసిలు , సర్పంచ్‌లు , సింగిల్ విండో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణం చేసిన దాతలకు సన్మానం..
Advertisement
తాజా వార్తలు
Advertisement