Saturday, November 23, 2024

ఓట్లు అడిగే నైతిక అర్హ‌త బిఆర్ఎస్ కు లేదు – రేవంత్ రెడ్డి

కోస్గి, ప్రభన్యూస్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వలేనోళ్లు ప్రజలను ఓట్లు- అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ”హాత్‌ సే హాత్‌ అభియాన్‌” ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ శివాజీ చౌర స్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ముమ్మాటికీ కోస్గి పట్టణాన్ని అభివృద్ధి పథంలో చేసింది తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేనని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు డ్రామా రావు వచ్చి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే కొడంగల్‌ను అభివృద్ధి చేస్తామంటేనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను ఇక్కడి ప్రజలు గెలిపించారని, కానీ కోస్గిలో నేటికీ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణంలోనే ఉన్న గోడలతోనే దర్శనమి స్తోందని అన్నారు.

కోస్గి బస్‌ డిపోకు తాను సొంతంగా భూమి కొనుగోలు చేసి ఇచ్చిన విషయం ఇక్కడి ప్రజలకు తెలియదా అన్నారు. పాలి-టె-క్నిక్‌ కళాశాల, కోస్గి- మద్దూరు డబుల్‌ లైన్‌ రోడ్డు, కోస్గి పట్టణంలో విశాల రోడ్లు ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేసింది తన హయంలోనేనన్నారు. మన సొమ్మును, సిద్దిపేట, సిరి సిల్లలకు తరలిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కొడంగల్‌ నుండే పోటీ- చేస్తానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమవుతున్న ”హాత్‌ సే హాత్‌ అభియాన్‌” యాత్ర ద్వారా గడప గడపకు రాహుల్‌ గాంధీ సందేశం వినిపించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ గాంధీ భారతదేశాన్ని ఏకం చేసే ఉన్నత లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారని, ప్రతి ఒక్కరూ 60 రోజుల పాటు- ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లుని తట్టి కాంగ్రెస్‌ వాణి వినిపించాలన్నారు.

- Advertisement -

అంతకుముందు గుండుమల్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, పీసీసీ సభ్యులు వార్ల విజయ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు రఘువర్దన్‌ రెడ్డి, సురేష్‌ రెడ్డి, విక్రమ్‌ రెడ్డి, నాగులపల్లి నరేందర్‌, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీను, మున్సిపల్‌ అధ్యక్షులు బెజ్జూ రాములు, గిరి ప్రసాద్‌రెడ్డి, సలీం, -టె-ంట్‌ నర్సింహులు, నాగులపల్లి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement