దేవరకద్ర : మండలంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా డీలర్లు జాగ్రత్తగా చూసుకోవాలని స్థానిక తహశీల్దార్ జ్యోతి డీలర్లను కోరారు. తహశీల్దార్ కార్యాలయంలో డీలర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నెల రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేసే విధంగా డీలర్ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా పెడుతామని తహశీల్దార్ జ్యోతి తెలిపారు. ఓటిపి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని డీలర్లకు తహశీల్దార్ జ్యోతి సూచించారు. ఈ సమావేశంలో ఉప తహశీల్దార్ శివరాజ్ , తారక్ , డీలర్లు బాలస్వామి , రాకేష్ , మాధవ రెడ్డి , వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న డీలర్లు , అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement