Saturday, November 23, 2024

రంజాన్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మక్తల్, తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం తెరాస ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీకగా తెరాస ప్రభుత్వం పండగలకు ప్రాధాన్యమిస్తూ ఆయా వర్గాల ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సోమవారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు డిసిసిబి చైర్మన్ చిట్యాల నిజాం పాషా తో కలిసి రంజాన్ కానుకలు పంపిణీ చేశారు .మక్తల్ నియోజకవర్గానికి రెండు వేల మందికి రంజాన్ కానుకలు మంజూరు కాగా అందులో మక్తల్ మండలానికి 500 కేటాయిస్తూ రంజాన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కొంత మంది లబ్ధిదారులకు అందజేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో తెరాస ప్రభుత్వం హిందువులకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు , ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ప్రజానీకానికి రంజాన్ కానుక అందించడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకగా నిలిపె లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పండగలు అనేవి సంతోషంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు. అయితే పండుగల వేళ నిరుపేద ప్రజానీకం నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండగ వేళ బట్టల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని రెండు వేల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారందరికీ కానుకలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని కోరుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు సూచించారు. ఈ పండుగను సోదరభావంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దారు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement