Tuesday, November 19, 2024

ఇంట్లోకి వచ్చిన వర్షపు నీరు..

దేవరకద్ర : మండల కేంద్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంట్లోకి నీరు చేరడంతో యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు ఇంట్లో వచ్చిన నీటిని తొలగిస్తున్నామని యజమాని చెన్నయ్య తెలిపారు. గతంలో ఇంటి ముందు డ్రైనేజి కాలువ ఉండేదని ఇప్పుడు ఆ కాలువ లేకపోవడం వల్ల వర్షపు నీరు మొత్తం ఇంట్లోకి వస్తుందన్నారు. అటు ఆర్‌ అండ్ ‌బి అధికారులను అడిగినా.. ఇటు గ్రామ పంచాయితీ అధికారులను అడిగినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని సమాధానం చెబుతున్నారని ఇంటి యజమాని వాపోయారు. ఇంట్లోకి వర్షపు నీరు రావడంతో మేం ఎలాగ జీవనం గడపాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు శ్రద్ద తీసుకుని వర్షపు నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement