పెద్దమందడి : కరోనాతో మూతపడిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి నెలకు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు 25కిలోల బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా పెద్దమందడి మండలంలో 8 ప్రైవేటు పాఠశాలలో 58 మంది టీచింగ్.. నాన్-టీచింగ్ సిబ్బందిని గుర్తించినట్లు ఎం ఈ ఓ జయశంకర్ తెలిపారు. వీరికి వారి అకౌంట్ లో రెండు వేల రూపాయల చొప్పున జమ అయ్యాయని అన్నారు. ఒక్కొక్కరికి 25 కేజీల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ..ఏప్రిల్ 21 నుంచి 24 వ తేది వరకు బియ్యంని సంబందిత రేషన్ షాప్ డీలర్స్ దగ్గర తీసుకోవాలని ఆయన సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement