Friday, November 22, 2024

ప్రజలకి ఇబ్బంది కల్పించొద్దు..

వీపనగండ్ల : కరోనా మహమ్మారి నివారణకై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే ఉమ్మడి మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి సిబ్బందిని స్థానిక సర్పంచ్ వంగూరు నరసింహారెడ్డి కోరారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపర్ వైజర్ సూర్యకాంతంను వ్యాక్సిన్ అందుతుందా లేదా అనే వివరాలను అడిగితెలుసుకున్నారు. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలాలలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆస్పత్రి వద్దకు ప్రతిరోజు వందల సంఖ్యలో రావడంతో సిబ్బంది వారిని అదుపు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని,వ్యాక్సిన్ వేయటానికి మరో కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే ప్రజలు కూడా సమన్వయం పాటిస్తూ ఒకరి తర్వాత ఒకరు వ్యాక్సిన్ వేయించుకొని ఆసుపత్రి సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆస్పత్రి వద్దకు వ్యాక్సిన్ కొరకు మరియు కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి రావాలని.. సామాజిక దూరం పాటించాలని సూచించారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో ఆస్పత్రి వద్ద మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు ఆస్పత్రి సిబ్బంది ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement