Saturday, November 23, 2024

ప్రజావేదికలో ఫిర్యాదుల స్వీకరణ..

మహబూబ్‌నగర్‌ : అట్టడుగున ఉన్న పేద వర్గాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని విశ్వాసం వారిలో కల్పించాల్సిన బాధ్యత అధికారులు , ప్రజా ప్రతినిధులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రజల సమస్యలను జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే అధికారులు , ప్రజా ప్రతినిధుల పట్ల పేద ప్రజలకు గౌరవం పెరుగుతుందని , అందువల్ల ప్రజా వేదిక కార్యక్రమం ద్వార స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు. ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం మంత్రి మహబూబ్‌నగర్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సాధ్యమైనంత వరకు అధికారులు , ప్రజావేదిక ద్వార వచ్చిన ఫిర్యాదులను అదే రోజు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు , ప్రజా ప్రతినిధులు అందరూ బాధ్యతగా బృందంలా పనిచేసినట్లయితే పేద ప్రజలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రజా వేదిక ద్వార ఇప్పటివరకు 246 ఫిర్యాదులు రాగా , 193 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని , మరో 53 పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు , ఎస్‌పి ఆర్‌. వెంకటేశ్వర్లు , జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement