Friday, November 22, 2024

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

అమరచింత : మున్సిపాలిటీ కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్  సింధుజ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి మక్తల్ ఎమ్మెల్యే  చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ  లక్ష్యమని పేర్కొన్నారు. ఆడపడుచులకు అండ  ముఖ్యమంత్రి కెసిఆర్  అని  ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ  అవుతున్నాయి అని తెలిపారు.  పార్టీలకతీతంగా అమరచింత మండల అభివృద్ధికి  ప్రతి ఒక్కరూ  సహకరించాలన్నారు. కరోనా వైరస్ రోజు రోజుకు  పెరుగుతుండడంతో ప్రజలు  కోవిడ్  నియమ నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. భౌతిక దూరాన్ని పాటించాలని ..కరోనా కట్టడికి శుభ్రత.. పరిశుభ్రత.. వ్యక్తిగత శుభ్రత పాటించి  కరోనా నివారణకు  ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని 22 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సింధుజ. అమరచింత.. ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ లు మంగమ్మ.. నాగభూషణం గౌడ్.. గాయత్రి రవి కుమార్ యాదవ్.. వైస్ చైర్మన్ లు  జిఎస్ గోపి.. విజయ భాస్కర్ రెడ్డి .. కౌన్సిలర్ లక్ష్మి వెంకటేష్ ..జడ్పిటిసి మార్క సరోజా వెంకటయ్య .. ఎంపీపీ బంగారు శ్రీనివాసులు.. వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి.. హనుమంతు.. కురుమన్న.. ఆత్మకూరు ..అమరచింత టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రవి కుమార్ యాదవ్..  రమేష్ ముదిరాజ్.. చుక్క ఆశి రెడ్డి.. సర్వ రెడ్డి.. ఎస్ ఏ రాజు.. జయసింహ రెడ్డి.. రఫీ.. షానవాజ్ . .తాటికొండ రమేష్. .మహమూద్. .దిలీప్ ఆయా గ్రామాల సర్పంచులు.. ఎంపిటిసిలు.. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement