గద్వాల ప్రతినిధి, మే 3 (ప్రభ న్యూస్): పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ప్రెసైడింగ్, అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గద్వాల సెగ్మెంట్, డి పి ఆర్ ఓ కార్యాలయంలో ఆలంపూర్ సెగ్మెంట్ కు సంబంధించి ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
అసెంబ్లీ సెగ్మెంట్ ల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్‌లను, ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుండి మే 8 వరకు నిర్వహించు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం ఓటింగ్ సరళి పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ సజవుగా, సాఫీగా జరిగేలా జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డిఓ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.