Friday, November 22, 2024

మార్కెట్‌ కు పోటెత్తిన ఉల్లి

దేవరకద్ర : మండల కేంద్రంలో మార్కెట్‌ యార్డుకు ఉల్లి పోటెత్తిపోయింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పండించిన ఉల్లిని విక్రయించడానికి మార్కెట్‌ యార్డుకు పెద్ద ఎత్తున తీసుకుని వచ్చారు. దుకాణబుూళ యజమానులు ఉల్లికి తూకాలు వేయడం జరిగింది. గరిష్ట ధర రూ.1000 , కనిష్ట ధర రూ.600 పలికింది. యజమానులు తెలిపారు. గత వారం కంటేఈ వారం పూర్తిగా ఉల్లి ధరలు తగ్గిపోవడం జరిగిందని అధికారులు చెప్పారు. ఉల్లి ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. హైద్రాబాద్‌లో కూడా ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పారు. వేలం పాటలోఓ దుకాణ యజమానులు సంజీవ రెడ్డి , సుదర్శన్‌ , నరేష్‌ , హరికాంత్‌ , విశ్వనాథం , లక్ష్మి నారాయణ , తిమ్మారెడ్డి , మార్కెట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement