Monday, November 18, 2024

మరో సైబర్‌ క్రైమ్‌ కేసు నవెూదు .. రూ.30వేలు పోగొట్టుకున్న బాధితుడు..

తిమ్మాజిపేట, (ప్రభ న్యూస్‌) : ట్రాక్టర్‌ అమ్ముతాం అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌కు ఆకర్షితులైన ఒక యువకుడు డబ్బులు పోగొట్టుకున్న ఘటన నేరెళ్ల పల్లి గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం నేరెళ్ల పల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్రస్వామి అనే యువకుడు ట్రాక్టర్‌ అమ్ముతాం అంటూ వచ్చిన ఒక పోస్టుకు ఆకర్షితుడయ్యాడు. చౌకగా ట్రాక్టర్‌ వస్తుందన్న ఆశ సదరు పోస్టుల్లో ఉన్న ఫోన్‌ నెంబర్‌కు సంప్రదించాడు. తను ఆర్మీలో పని చేస్తున్నానని అని డబ్బులు అవసరం ఉంది ట్రాక్టర్‌ ఆమ్ముతున్నాను అంటూ అతను చెప్పగా బాధితుడు అతనితో బేరం కుదుర్చుకున్నాడు.

ఒక లక్ష 70 వేలు ట్రాక్టర్‌ విక్రయ ఒప్పందం కుదిరింది. ఖర్చులు రిజిస్ట్రేషన్‌ అంటూ 30 వేలు పంపించమని అడుగగా అతను గూగుల్‌ పే ద్వారా రూ.30,000 పంపాడు. మరోసారి మరో 30 వేలు పంపించాలని అతని సూచన మేరకు మరో 30వేలు పంపాడు. అయితే అతను నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం కలిగిన బాధితులు వెంటనే అధికారులను సంప్రదించాడు. దీంతో మొదట డబ్బులు మినహా మిగిలినవి అధికారులు కాపాడారు. మొదట పంపిన డబ్బులు అతనికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement