మహబూబ్‌నగర్ : పాలమూరు మున్సిపాలిటీ సంబంధించిన 2021-22 వార్షిక బడ్జెట్ జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో తప్పుల తడకగా ప్రవేశపెట్టాలని బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అంజయ్య ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో 25 కోట్లు చూపించి , ఈ సారి మాత్రం రూ.22 కోట్లు చూపించారని అన్నారు. గతంలో పన్నురాబడి 23 కోట్లు చూపిస్తే ఈ సారి రూ.21 కోట్లు చూపించారని స్థిరాస్థి పన్ను గతంలో రూ.6 కోట్లు ఉంటే ఈ సారి 0 గా చూపించారని పేర్కొన్నారు. అదే విధంగా 166 కోట్లు రూపాయలు అమృత్ నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే చైర్మన్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని. స్వచ్ఛ్ భారత్ క్రింద మంజూరైన టాయిలెట్స్ గూర్చి కూడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు ద్వారనే పట్టణం అభివృద్ది చెందిందని బడ్జెట్ సమావేశంలో సమస్యల ప్రస్తావన కు అవకాశం ఇవ్వకుండా మంత్రి తను చేసిన పనుల గురించి గొప్పలు చెప్పడానికి సమయం వెచ్చించడంతో చాలా మంది సభ్యులు నిరాశకు లోనయ్యారని విమర్శించారు. బిజెపి నాయకులు డికె అరుణ , యెన్నం శ్రీనివాస్ రెడ్డిచొరవతో జిల్లాకు మెడికల్ కళాశాల , ట్యాంక్‌బండ్ నిధులు గతంలోనే విడుదలయ్యాయని గుర్తు చేశారు. భూత్పూర్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జిల కాంట్రాక్టర్‌ను బెదిరించింది టిఆర్‌ఎస్ నాయకులు కాదా అంటూ ఘాలు విమర్శలు చేశారు. ప్రస్తుతం మన దగ్గర జరుగుతున్న శిల్పారామం పనుల్లో నాణ్యత లేదని అందువల్ల రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు రామాంజనేయులు , చిన్న వీరయ్య , పట్టణ అధ్యక్షులు పోతుల రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement