Monday, November 25, 2024

MBNR | లా అండ్ ఇంజనీరింగ్ కళాశాలలకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ) : మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లా అండ్ ఇంజనీరింగ్ కళాశాలలకు, పాలమూరు విశ్వవిద్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తో కలిసి మంగళవారం స్థల పరిశీలన చేశారు.

అనంతరం పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్మాణంలో ఉన్న రీసెర్చ్ బిల్డింగ్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement