Thursday, September 19, 2024

MBNR: కోతుల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే శ్రీహరి..

మక్తల్ : ప్రతినిత్యం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ప్రజల హృదయాలను గెలుచుకునే ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకలితో రోడ్డుపై తచ్చాడుతున్న కోతుల మంద కనిపించడంతో తన వాహనాన్ని రోడ్డుపై నిలిపి కోతుల మందకు అరటిపండ్లు ఇచ్చి వాటి ఆకలి తీర్చిన సంఘటన ఇవాళ సాయంత్రం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం వద్ద చోటు చేసుకుంది.

మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కృష్ణా మండల కేంద్రంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న సమయంలో 167వ జాతీయ రహదారిపై మాగనూరు వద్ద కోతుల మంద కనిపించడంతో ఆయన తన వాహనాన్ని రోడ్డుపై నిలిపారు. తన వాహనంలో ఉన్న అరటి పండ్లను తీసుకొని కోతులకు అందించి వాటి ఆకలి తీర్చారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఎమ్మెల్యే తీరును స్థానికులు 167వ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు చూసి హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement