Wednesday, October 16, 2024

MBNR: కోర్టు మంజూరుతో దశాబ్దాల కల సాకారం.. సీఎం కు ఎమ్మెల్యే శ్రీహరి ధన్యవాదాలు

మక్తల్, జులై 11(ప్రభ న్యూస్) : మక్తల్ పట్టణవాసుల దశాబ్దాల కల అయిన కోర్టును మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ వాసులందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నట్టు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్ లో కోర్టు కోసం సీఎం రేవంత్ అడిగిన వారం రోజుల్లోనే అన్ని శాఖల అధికారులను సమన్యాయం చేసుకుంటూ స్పెషల్ సీఎస్ దగ్గరకు వెళ్లి త్వరగా కోర్టు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం సంతోషకరమన్నారు.

మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కృష్ణ మండలంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు నారాయణపేటకు వెళ్లి రావాలంటే 140 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుందని… కోర్టు ఆవశ్యకతను సీఎంకు వివరించగానే మంజూరు చేశారని తెలిపారు. అతి త్వరలో కోర్టును ప్రారంభించుకుందామని, దీంతో పాటు పశువుల సంత కోసం ఆరు ఎకరాల స్థలం, డిగ్రీ కళాశాల కోసం శాశ్వత భవనం ఇలా మక్తల్ నియోజవర్గంలో అత్యవసరమైన 28 పనులను గ్రామ పద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్తానని వాకిటి శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. జీవితాంతం వారికి సేవ చేసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నేతలు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, కట్టా సురేష్ గుప్తా, చంద్రకాంత్ గౌడ్, బి.గణేష్ కుమార్, బోయ రవికుమార్, అయుబ్ ఖాన్, గోపల్లి నారాయణ, తులసిరాజు, తదితరులు పాల్గొన్నారు.

మహిళల సంక్షేమానికి ప్రత్యేక కృషి: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి…
ఊట్కూర్, జులై 11 (ప్రభ న్యూస్) : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆర్డీవో కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ దరఖాస్తులను పరిష్కరించి సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మమత, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ వై.నారాయణరెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి, చంద్రకాంత్ గౌడ్, కొక్కు లింగం, రిషి కుమార్, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నారాయణ, రమేష్ అలీమ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement