మక్తల్, జులై 15(ప్రభ న్యూస్) : భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్ నుండి ఇవాళ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రిజర్వాయర్ల కింద ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని చెప్పారు. అదేవిధంగా ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి రైతు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. రైతులకు ఏ విషయంలోనూ ఇబ్బంది రాకుండా తాము చూసుకుంటామన్నారు. నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, కాంగ్రెస్ నాయకులు బి.గణేష్ కుమార్, నురుద్దీన్, భీమ్ సేన్ రావు, చెన్నయ్య గౌడ్, డీఈ సతీష్, ఏఈఈ మోహన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.