మక్తల్, మార్చి 2(ప్రభన్యూస్): రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఇటీవల నియమితులైన డాక్టర్ చిన్నారెడ్డిని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ హైదరాబాదులోని చిన్నారెడ్డి నివాసంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలుసుకుని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తనవంతు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కోరారు. ఎమ్మెల్యేతో పాటు చిన్నా రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎల్కోటి లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.