Saturday, November 23, 2024

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం..

గద్వాల : మండల లోని లత్తిపురం, బీరెల్లి, గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా ఐ కే పి సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతు బీమా, రైతు బంధు, సబ్సిడీ ద్వారా ఫర్టిలైజర్ రైతులకు వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారన్నారు..రైతులకు మద్దతు ధర 1888 రూపాయలు ఇచ్చారన్నారు. గత సంవత్సరం కరోనా సమయంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి వారి ఖాతాలో డబ్బులు జమ చేశామన్నారు.తమ తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని..రైతులు పొలంలో పని చేసేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించాలన్నారు. రైతులు మాస్కు ధరించాలి.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలి.. ఎలాంటి అపోహలు భయం వద్దు అని తెలిపారు.కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు.. సలహాలు తప్పనిసరిగా పాటించాలి ..కరోనాని అరికడదాం..
మన ప్రాణాలు మనమే కాపాడుకుందాం..రైతులకు అన్ని విధాలుగా అధికారులకు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, గ్రామాలు సర్పంచ్లు ఎంపిటిసిలు, గద్వాల మండల తెరాస అధ్యక్షుడు రమేష్ నాయుడు అధికారులు, తెరాస నాయకులు సత్య రెడ్డి, , నీలఈశ్వర్ రెడ్డి ,రాజారెడ్డి, బీచు పల్లి, శ్రీ రాములు నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement